సౌదీ అరేబియా ఆకాశంలో బ్లడ్ మూన్ కనువిందు..!!
- September 08, 2025
జెడ్డా: సౌదీ అరేబియాలో అరుదైన బ్లడ్ మూన్ దర్శనమించింది. సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని అక్కడి ప్రజలు ఆస్వాదించారు. భూమి నీడ చంద్రునిపై పడగానే ముదురు ఎరుపు రంగులోకి మారి కనువిందు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ బ్లడ్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించి కనువిందు చేసింది. ఇది దాదాపు 83 నిమిషాల పాటు కొనసాగింది. ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యంత పొడవైన వాటిలో ఒకటిగా నిలిచింది.
చంద్ర గ్రహణం సౌదీ సమయం ప్రకారం సాయంత్రం 7:27 గంటలకు ప్రారంభమైంది. పూర్తి గ్రహణం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:53 గంటలకు ముగిసింది. మొత్తంగా గ్రహణ ప్రక్రియ రాత్రి 11:57 గంటలకు ముగిసింది.
ఈ అరుదైన బ్లడ్ మూన్ ను చూడటానికి ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు మరియు ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. టెలిస్కోప్‌లు, కెమెరాలతో పాటు ప్రజలు నేరుగా కంటితో చూసేందుకు వీలుగా భారీ స్క్రీన్ లను ఏర్పాటు చేసినట్లు జెడ్డా ఆస్ట్రోనామికల్ సొసైటీ అధ్యక్షుడు ఇంజినీర్ మాజెద్ అబు జహ్రా తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!