పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. మెగా వారసుడు రావడంతో సందడే సందడి
- September 10, 2025
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు. ఆయన భార్య, నటి లావణ్య త్రిపాఠి మగ బిడ్డ కు జన్మనిచ్చింది. రెయిన్ బో ఆసుపత్రి లో లావణ్య డెలివరీ అయినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని.. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి సైతం మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటలకి వెళ్లి వరుణ్, లావణ్యలకి శుభాకాంక్షలు తెలియజేసినట్టు సమాచారం. కాగా విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, మెగా ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
మెగా ఆనందం..
కొద్ది రోజుల క్రితం వరుణ్- లావణ్యలు ఒక అందమైన ఫొటోను షేర్ చేస్తూ తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అనే విషయం తెలియజేయడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. నెటిజన్లు కూడా వరుణ్ – లావణ్య దంపతులకు శుభాకాంక్షల వర్షం కురిపించారు. మెగా ఫ్యామిలీలో హీరోయిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో హీరోగా వరుణ్ తేజ్ నిలిచాడు. పవన్ కళ్యాణ్ తర్వాత హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వరుణ్ తేజ్ మాత్రమే. వరుణ్ – లావణ్య లవ్ స్టోరీ ఎక్కువగా ప్రచారంలోకి రాకుండా సీక్రెట్‌గానే కొనసాగింది. 2023, నవంబర్ 1న ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2023లో వచ్చిన ‘గాండీవధారి అర్జున’, తర్వాతి ఏడాది విడుదలైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఆ తర్వాత వచ్చిన ‘మట్కా’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి ‘VT-15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా వరుణ్ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వస్తాడా? అన్నది చూడాలి.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్