అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- September 11, 2025
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఖతార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అమిరి దివాన్‌లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య బలమైన సోదర సంబంధాలను మరియు వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు.
తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఖతార్ తీసుకునే నిర్ణయాలకు యూఏఈ మద్దతుగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఇజ్రాయెల్ దాడి ఖతార్ సార్వభౌమత్వాన్ని, అన్ని అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని సాధించడానికి అమీర్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. అంతకుముందు యూఏఈ ప్రెసిడెంట్ దౌత్య బృందాన్ని అమీర్ ఘనంగా స్వాగతించారు.
తాజా వార్తలు
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్