ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!

- September 11, 2025 , by Maagulf
ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!

కువైట్: చారిత్రక ముబారకియా మార్కెట్‌లోని అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న భాగంలో షేడెడ్ మరియు ఎయిర్ కండిషన్డ్ వాక్‌వేలను ఏర్పాటు చేసేందుకు కువైట్ మునిసిపాలిటీ ఆమోదించింది. కువైట్ సాంప్రదాయ నిర్మాణ వారసత్వాన్ని సంరక్షించే విధంగా భవనాలు మరియు వాక్‌వేలను పునరుద్ధరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

సందర్శకులు మరియు దుకాణదారులను అధిక ఉష్ణోగ్రతలు, వర్షాల నుండి రక్షించడానికి పబ్లిక్ వాక్‌వేలను నిర్మించనున్నారు. ఇది స్థానికులు, పర్యాటకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com