ప్రీ మెచ్యూర్‌ మెనోపాజ్‌తో వచ్చే కష్టాలు

- July 16, 2015 , by Maagulf
ప్రీ మెచ్యూర్‌ మెనోపాజ్‌తో వచ్చే కష్టాలు

సాధారణంగా యుక్త వయసు రాగానే అమ్మాయిల్లో మొదలయ్యే నెలసరి కార్యక్రమం క్రమం తప్పకుండా నెలనెలా పలకరిస్తూ ఉండాలి. ఇలా స్త్రీలలో 40 - 50 ఏళ్లు వచ్చే వరకూ ఈ ఋతుక్రమం క్రమం తప్పకుండా రావాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు స్త్రీలలో చిన్న వయసులోనే గర్భాశయాలు తొలగించే ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. గర్భాశయాన్ని తొలగించవచ్చు. కానీ అండాశయాలు మాత్రం తొలగించకూడదు. వాటిలో ఏదైనా తప్పని సమస్య వస్తేనే తప్ప. అయితే ఈ రకంగా ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల నెలసరి సడెన్‌గా ఆగిపోతుంది. మెనోపాజ్‌ దశ వచ్చినాక నెలసరి ఆగిపోతే ఫర్వాలేదు కానీ ఈ రకంగా రాని వయసులోనే ఆగిపోతే అలాంటి మహిళల్లో అనేక రకాల హార్మోన్‌ల సమస్య తలెత్తుతుంది. తద్వారా వారిలో చిన్న విషయానికే చికాకులు, నీరసం, చెమటలు ఎక్కువగా పట్టడంలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వారు తప్పకుండా మెనోపాజ్‌ స్టేజ్‌ వచ్చే వరకూ హార్మోన్‌ చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న వయసులో వచ్చే మెనోపాజ్‌ (ప్రీ మెచ్యూర్‌ మెనోపాజ్‌)కి తప్పనిసరిగా వైద్యుని సలహాతో నిర్లక్ష్యం చేయకుండా హార్మోన్‌ చికిత్స అవసరాన్ని మహిళలూ తప్పక గుర్తించండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com