కేంద్ర ప్రభుత్వంలో మరో కొత్త శాఖ చేరింది..
- July 21, 2016
కేంద్ర ప్రభుత్వంలో మరో కొత్త శాఖ చేరింది. కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖను రెండుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలుగా పనిచేయనున్నాయి. ఇంటర్నెట్, సంబంధిత సేవలు, ఆధార్‌పై ప్రత్యేకంగా పనిచేసేందుకు ఈ కొత్త శాఖను ఏర్పాటుచేసినట్లు కేంద్రం తెలిపింది.
ఈ మార్పులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించినట్లు కేబినెట్ సెక్రటేరియట్ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ), ఆధార్ నంబర్లు తదితర విషయాలపై పనిచేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో యూఐడీఏఐను నీతీఆయోగ్ కింది నుంచి కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిపాలన కిందికి తెచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









