కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- October 28, 2025
కువైట్: కువైట్ లోని రిజర్వ్ పార్కులో అక్రమంగా వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా సబా అల్-అహ్మద్ నేచర్ రిజర్వ్‌లోకి ప్రవేశించి, ఫాల్కన్‌లను ఉపయోగించి వన్యప్రాణులను వేటాడినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. రక్షిత అటవీ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ 105 ప్రకారం..అటవీ లేదా సముద్ర జీవులకు హాని కలిగించడం, రిజర్వ్ ప్రాంతాలను దెబ్బతీయడం లేదా అడవి జంతువులను వేటాడటం, పట్టుకోవడం లేదా వెంబడించడం నిషేధం. ఈ ఆర్టికల్‌ను ఉల్లంఘించిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, 500 నుండి 5,000 దినార్ల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. .
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







