సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!

- October 28, 2025 , by Maagulf
సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేట్ రంగంలో స్టానికీకరణను వేగవంతం చేయనున్నారు. ముఖ్యంగా అకౌంటింగ్ ప్రొఫేషన్ లో స్థానికీకరణ రేటును 40 శాతం పెంచేందుకు ఉద్దేశించిన మొదటి దశ అక్టోబర్ 27 నుండి అమల్లోకి వచ్చింది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది అకౌంటెంట్లను నియమించే సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.  

కనీస వేతనం బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగిన వారికి SR6,000 మరియు డిప్లొమా లేదా దానికి సమానమైన అర్హత కలిగిన వారికి SR4,500గా నిర్ణయించారు.  రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు దశల్లో స్థానికీకరణను 70శాతానికి  చేర్చనున్నారు. 

చట్టాలను ఉల్లంఘించినవారిపై చట్టపరమైన జరిమానాలను విధిస్తామని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.  అదే సమయంలో ఉత్తర్వులను అమలు చేసే ప్రైవేట్ రంగ సంస్థలకు తగిన మద్దతు,  ప్రోత్సాహక ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com