అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!

- October 29, 2025 , by Maagulf
అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!

యూఏఈ: అద్దెదారులకు షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. రియల్ ఎస్టేట్ లీజింగ్ మరియు దాని కార్యనిర్వాహక నిబంధనలను సవరణకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సెప్టెంబర్ 19, 2024కి ముందు గడువు ముగిసిన ఒప్పందాలను క్రమబద్ధీకరించుకోని అద్దెదారులకు విధించిన జరిమానాలను పూర్తిగా మినహాయించడంతో పాటు, ప్రామాణీకరణ రుసుములపై 50 శాతం మినహాయింపును ప్రకటించారు.   

ఈ మినహాయింపులు నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక మరియు పెట్టుబడి ఒప్పందాలు సహా అన్ని రకాల లీజులకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు.  

దీనితోపాటు కౌన్సిల్ హసద్ సెంటర్ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. ఇది ఆహార భద్రతకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు షార్జాలోని రైతులకు సహాయం చేయడానికి రూపొందించబడిన ఒక ప్రాజెక్టు. ఈ కేంద్రం పండ్లు మరియు కూరగాయల సేకరణ కేంద్రంగా పనిచేస్తుంది. వాటి పంపిణీని సులభతరం చేస్తుంది. స్థానిక ఉత్పత్తిదారులకు మద్దతును అందిస్తుందని పేర్కొన్నారు.

షార్జా క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ పాలకుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అధ్యక్షతన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com