F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- November 01, 2025
దోహా: ఫార్ములా 1 ఖతార్ ఎయిర్‌వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025 కి కేవలం ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉంది. లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (LIC) ఫ్యాన్ జోన్ మరియు రోజువారీ ఆన్-సైట్ ఎంటర్ టైన్ ప్రోగ్రామ్స్ కొత్త వివరాలను ఆవిష్కరించింది. నవంబర్ 28 నుండి 30వరకు ప్రపంచ స్థాయి రేసింగ్ అనుభవాలకు లుసైల్ సర్యూట్ కేంద్రంగా మారుతుంది.
2025 ఎడిషన్ ఫార్ములా 1 స్ప్రింట్ రేస్, FIA ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్ మరియు పోర్స్చే కారెరా కప్ మిడిల్ ఈస్ట్‌తో నాన్-స్టాప్ ట్రాక్ యాక్షన్ అందించనుంది. ట్రాక్ బయట సీల్ ఆన్ ఫ్యామిలీ ఫ్రైడే మరియు మెటాలికా హెడ్‌లైన్ రేస్ డే వంటి ప్రపంచ దిగ్గజాల ప్రదర్శనలతో ఉర్రూతలూగనుంది.
మిడిల్ ఈస్ట్‌లో అరంగేట్రం చేస్తున్న LEGO, ప్రాజెక్ట్ అలిసియా గ్లోబల్ టూర్‌లో భాగంగా ఖతార్‌కు దాని ప్రసిద్ధ ఫార్ములా 1 యాక్టివేషన్‌ను తీసుకువస్తుంది. అభిమానులు ఇక్కడ తమ సొంత మినీ LEGO F1 కార్లను తయారు చేసుకోవచ్చు. LEGO నేపథ్య పిట్‌లేన్ మరియు గ్యారేజీని అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది.
శుక్రవారం మరియు శనివారం జరిగే F1 ఫ్యాన్ ఫోరంలో భాగంగా ఇక్కడ తమకిష్టమైన డ్రైవర్లతో మాట్లాడవచ్చు. AR కార్ రేసింగ్ & రేసింగ్ కంటైనర్ లో ఇంటరాక్టివ్ సిమ్యులేటర్లు మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనుభవాలను అభిమానులు నేరుగా పొందవచ్చు.
ఈ సంవత్సరం రేసు టిక్కెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. అభిమానులు పరిమితమైన మిగిలిన మూడు రోజుల గ్రాండ్‌స్టాండ్ పాస్‌లు, హాస్పిటాలిటీ ప్యాకేజీలతోపాటు సింగిల్ డే టిక్కెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్‌వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







