దయార్ద్ర హ్రుదయిని

- July 17, 2015 , by Maagulf
దయార్ద్ర హ్రుదయిని

ఓ ప్రియ సఖీ, నీకు జ్ఞాపకం ఉందా?

క్రితం సారి నేను నిన్ను చేర వచ్చినప్పుడు

మన గదిలో దుస్తుల కొక్కెం పై ఓ పిచ్చుకల జంట మన సిగ్గైన గుస గుసల మధ్య,

వాటి సరసమైన ఇక ఇకలు పక పకలు,ముక్కుల్తో

అన్యోన్యంగా నిమురుకుంటూ కిచ కిచల...పచ్చటి కాపురం

 

పొద్దు పొడిచి లోకమంతా

నిత్య కర్మల ఉపక్రమణ అయినా,

లేవని ఆ అలసిన జంట,బట్టలన్నీ

అపరిసుభ్రం చేస్తున్నాయన్న వంకతో

నేను నా అదిలింపు, వద్దండీ అని నువ్వు

నీ దయార్ద్ర హృదయంతో సుతారమైన వారింపు

 

మళ్లీ,కొద్ది రోజుల్లో నీ నుండి

నేను దూరంగా వెళతాననగా

అది సూచనో,దైవ నిర్ణయమో కాని,

 

జంట వీడి ఓపక్షి నమ్మిన జీవిత

నేస్తాన్ని విడచి ఎక్కడికో ఎగిరిళ్ళిన క్షణం, అలకో దుర్ఘటనో, తిరిగి రాని దాని ప్రేమపై, బెంగతో బిక్కు బిక్కు మంటూ ప్రతీ రాత్రి నడిరేయి వరకు మూగగా దీనంగా చూసే, ఆ పిచ్చుకరాణి ఒంటరి చూపులను

 

తట్టుకొనే శక్తి లేకో లేదా ఇష్టం లేకో,

నా తల దిండులో, నీవు నా ఎదలో,

అలసటో నటనో ఎడబాటును ఆపే

మూగ ప్రార్థనలో ..

 

ప్రకృతి ప్రళయాన్ని ముందే పసిగట్టే

అల్ప జీవుల్లా ఆ ఘటన,ఎలా జరిగెనో,

 

నవనీతమైన నీ మనసుతో కలయిక,

మళ్లీ అప్పుడే ఎందుకో ఈ విడతీత,

 

కానీ దీనిలోని పాత్రలం మనమేనా లేక

ప్రతీ చోటా ఇంతేనా ప్రకృతి అంతా ఇంతేనా

ఎవరు పెట్టిన శాపాలో ఎందుకో ఇలా ..

ఈ గుండెల తహ తహలు ..ఎందుకో

అనంత ప్రేమ మూర్తివి అయిన

నీ ప్రేమ రాహిత్యంలో యవ్వనులు,వృద్ధులు

కవులు సర్వకోటి విలాపాలు!

 

( 07-07-2015)

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com