కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్

- December 29, 2025 , by Maagulf
కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఆసక్తి నెలకొన్నప్పటికీ, ఆయన సభలో కేవలం కొన్ని నిమిషాలే ఉండి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఉద్దేశంతో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని ఆయన విమర్శించారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావడం వెనుక ప్రజల సమస్యలు కాకుండా, ఎమ్మెల్యే హోదా కొనసాగించుకోవడమే ప్రధాన ఉద్దేశమని బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా జీతం పొందడానికే ఆయన సభకు వచ్చారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని పెద్దగా హైప్ చేశారని, కానీ వాస్తవంగా ఆయన రెండు నిమిషాలు కూడా సభలో ఉండలేదని తెలిపారు. సభలో దళిత స్పీకర్‌ను “అధ్యక్షా” అని సంబోధించాల్సి వస్తుందన్న అసహనం, దళితుల సమస్యలపై చర్చించాల్సి వస్తుందన్న కారణాలతోనే కేసీఆర్ వెళ్లిపోయారని ఐలయ్య విమర్శించారు. దళితుల పట్ల ఆయనకు నిజమైన గౌరవం లేదన్న విషయం ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com