ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- December 29, 2025
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 24 అంశాలపై చర్చించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపారు. మొత్తం 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేశామని.. తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాల్లో మార్పుల గురించి వివరాలు వెల్లడించారు. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. మొత్తం 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు తెలిపారు. చేర్పులు, మార్పులన్నీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
అదేవిధంగా.. సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామని, రూ. 41కోట్ల రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకొచ్చారు. స్మార్ట్ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్టణంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







