ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు

- January 04, 2026 , by Maagulf
ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో(X Platform) అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ వేగంగా పెరుగుతుండటంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్లాట్‌ఫామ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ కంటెంట్ పోస్ట్ చేస్తే, ఆ పోస్టులను పూర్తిగా తొలగించడమే కాకుండా సంబంధిత ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని స్పష్టం చేసింది.

స్థానిక ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలతో సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థకు చెందిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అధికారిక అకౌంట్ ద్వారా ప్రకటించింది.

అశ్లీల కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు ఏఐ ఆధారిత గ్రోక్ టెక్నాలజీని వినియోగిస్తామని గతంలోనే ఎలాన్ మస్క్ హెచ్చరించారు. అదే దిశగా ఇప్పుడు గ్లోబల్ గవర్నమెంట్(X Platform) అఫైర్స్ విభాగం కూడా స్పందిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అకౌంట్లపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఎక్స్ కంటెంట్ పాలసీలకు సంబంధించిన లింక్‌ను కూడా షేర్ చేసింది.

భారత ప్రభుత్వం కూడా ఎక్స్‌లో పెరుగుతున్న అశ్లీల కంటెంట్‌ను గమనించింది. ముఖ్యంగా గ్రోక్ ఏఐ ద్వారా మహిళల అసభ్యకర చిత్రాలను రూపొందించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 2న ఎక్స్‌కు నోటీసులు జారీ చేసి, ఆ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే దీనిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com