రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
- January 04, 2026
తిరుమల: ఇటీవల కాలంలో మున్నెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు రికార్డుస్థాయిలో స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా శుక్రవారం నుంచి సాధారణ భక్తులకు దర్శన అవకాశం కల్పించడంతో (Tirumala) నిన్న 83,032 మంది భక్తులు దర్శించుకోగా 27,372 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో నిలబడి దర్శనం చేసుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.10 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో వసతులు, నిర్వహణ మెరుగుపడటంతో భక్తులకు మెరుగైన దర్శన భాగ్యం లభిస్తోంది. 2025లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, లడ్డూల విక్రయం, ఇతర సేవలన్నీ మెరుగుపడ్డాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ (TTD) పాలకమండలి కొత్త ప్రణాళికలు అమలు చేసింది. 2024లో 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా, 2025లో 2.61 కోట్ల మంది దర్శించుకున్నారు. 2024లో హుండీ ఆదాయం 1365 కోట్లు కాగా, 2025లో 1383.90 కోట్లుగా నమోదైంది. 2026లోనూ పలు సంస్కరణలు అమలు చేయాలని టీటీడీ యోచిస్తోంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!







