సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- January 06, 2026
రియాద్ః సౌదీ అరేబియాలో నేషనల్ ప్రోగ్రామ్ టు కాంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసత్తూర్) 3,785 తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 123 కవర్-అప్ కేసులను నమోదు చేశారు. వాణిజ్య సంస్థలు సంబంధిత నిబంధనలను పాటిస్తున్నాయో లేదో ధృవీకరించడం మరియు నేరాలు, వాణిజ్య నిరోధక కన్సీల్మెంట్ చట్టం ఉల్లంఘనలను గుర్తించడం ఈ తనిఖీల లక్ష్యమని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం కన్సీల్మెంట్ వ్యతిరేక చట్టం ప్రకారం.. ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR5 మిలియన్ల వరకు జరిమానా విధించడంతోపాటు ఆయా సంస్థలు, వాటి యజమానుల ఆస్తులను జప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలను మూసివేయడంతోపాటు వాటి వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్‌లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







