బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- January 06, 2026
మనామా: ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ లో జనవరి 22 నుండి 31 వరకు 36వ ఎడిషన్ ఆటమ్ ఫెయిర్ 2026ను నిర్వహించనున్నారు. బహ్రెయిన్ లో ప్రముఖ వార్షిక కార్యక్రమాలలో ఈ ఆటమ్ ఫెయిర్ ఒకటని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, EWB చైర్పర్సన్ సారా అహ్మద్ బుహిజీ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు ఇన్ఫార్మా బహ్రెయిన్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. 36వ ఎడిషన్ ఈ ఫెయిర్ చరిత్రలో అతిపెద్ద ఎగ్జిబిషన్ గా రికార్డు సృష్టించనున్నదని పేర్కొన్నారు. 24 దేశాల నుండి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని, 2 లక్షల కంటే ఎక్కువగా విజిటర్స్ వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆటమ్ ఫెయిర్ 2026 ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లోని హాల్స్ 2, 3, 5 మరియు 6లలో జరుగుతుంది. ప్రవేశం ఉచితం. అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉందని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్‌లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







