పడవల సహాయంతో వర్షపు నీటిలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం

- July 29, 2016 , by Maagulf
పడవల సహాయంతో వర్షపు నీటిలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం

దక్షిణాదినా భారీ వానల జోరు మొదలైంది. హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా తరచుగా పడ్డ వానలకు ట్రాఫిక్‌ జామ్‌లతో, గుంతలు పడ్డ రోడ్లతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిన గుడ్‌గావ్‌ నగరం నిన్నటి నుంచి వాహనదారులకు నరకం చూపిస్తోంది. తాజాగా బెంగుళూరులో భారీ వర్షాలు మొదలయ్యాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు నీటిలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది పడవల సహాయంతో బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం, గాలి కారణంగా చెట్లు విరిగి పడిపోవడం కూడా ట్రాఫిక్‌ అంతరాయానికి కారణమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com