వైఎస్సార్ సీపీ నేతకు గాయాలు
- August 03, 2016
పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు- ఆచంట రహదారిలో జరిగిన రోడ్డుప్రమాదంలో కారు బోల్తా పడి ఆచంటకు చెందిన వైఎస్సార్ సీపీ నేతకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆచంటకు చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్ బంద్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.అనంతరం పెనుమంట్రలో పోలీసులు అరెస్ట్ చేసిన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ కవురు శ్రీనివాసుకు సంఘీంభావం తెలిపేందుకు ఆయన తన అనుచరులతో కలిసి కారులో వెళ్తున్నారు. ఇంతలో మార్టేరుకు సమీపంలో ఓఎన్జీసీ పనులు చేస్తున్న చోట కారు అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో కిశోర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదం విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి నియోజకవర్గ కన్వీనరు కవురు శ్రీనివాసు, నాయకులు కర్రి వేణుబాబు, అల్లం భాస్కరరెడ్డి, ఉన్నమట్ల మునిబాబు చేరుకుని కిశోర్‌ను ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







