రజినీకాంత్‌ ట్విట్టర్‌ అకౌంట్ హ్యాకింగ్‌...

- August 03, 2016 , by Maagulf
రజినీకాంత్‌ ట్విట్టర్‌ అకౌంట్ హ్యాకింగ్‌...

హ్యాకింగ్ సెలబ్రేటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. అభిమానులకు దగ్గరగా ఉటుందని సోసల్ మీడియాలోకి అడుగుపెడితే.. సదరు అకౌంట్లు హ్యాక్ చేసిన తలనెప్పి తెప్పిస్తున్నారు హ్యాకర్లు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ట్విట్టర్‌ అకౌంట్ కూడా హ్యాకింగ్‌కు గురైంది.
ట్విట్టర్ లో అత్యదిగా ఫాలోయింగ్ వుంది రజనీకి. అయితే ఆయన చాల రేర్ గా యాక్టివ్ అవుతారు. కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా చాలా పోస్టులు ఆయన ఖాతాలో దర్శనమిచ్చాయి. దింతో అభిమానులు వెంటనే రజినీకి సమాచారం అందించారు. రజినీ ట్విట్టర్‌ హ్యాక్‌ అయిందని తెలుసుకున్న వెంటనే రజినీ ఆన్‌లైన్‌ వ్యవహరాలు చేసుకొనే సభ్యులు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పదించిన సైబర్ పోలీసులు అకౌంట్ ని రిస్టోర్ చేశారు.
దీనిపై రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ ట్వీట్ చేస్తూ.. రజినీ ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్‌ అయినట్లు గుర్తించి సమాచారం అందించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com