'సరైనోడు. 100 రోజులు పార్టీ...

- August 03, 2016 , by Maagulf
'సరైనోడు. 100 రోజులు పార్టీ...

ఈ సంవత్సరం సమ్మర్ రేస్ కు వచ్చిన 'సరైనోడు' సాధించిన ఊహించని సక్సస్ ను అల్లు అర్జున్ ఇంకా మరిచిపోలేక పోతున్నాడు. ఈమధ్యనే 100 రోజులు పూర్తి చేసుకున్న ఈసినిమా సక్సస్ ఆనందాన్ని నిన్న రాత్రి అల్లు అర్జున్ ఈ సినిమా యూనిట్ సభ్యులతో షేర్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే ప్రారంభం అయిన అల్లుఅర్జున్ క్లబ్ 'యమ్ కిచెన్ అండ్ హైలైఫే' లో ఈ పార్టీ నిన్న అర్దరాత్రి వరకు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈసినిమా యూనిట్ కు సంబంధించిన చాలామంది ఈ పార్టీకి రావడంతో బన్నీ ఈ పార్టీ పూర్తి అయ్యే వరకు ఈ క్లబ్ లోనే అందరితో కలిసి కాలం గడిపాడని తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా అల్లుఅర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే కొత్త సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంబం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం దర్శకుడు హరీశ్ శంకర్ రాసిన క్యారెక్టర్ కోసం 'ధూమ్ 2' లో హృతిక్ రోషన్ తరహాలో ఒక 8-ప్యాక్ బాడీ చేస్తే బాగుంటుందని అల్లుఅర్జున్ భావిస్తున్నాడని టాక్. ఇప్పటివరకు మనం చూసిన టాలీవుడ్ టాప్ హీరోల ప్యాకులన్నీ ఒక వైపు ఇప్పుడు బన్నీ లేటెస్ట్ సినిమాలో అల్లుఅర్జున్ అభిమానులు చూడబోయే ప్యాకు మరో వైపు అనే తరహాలో ఈ లుక్ ఉండబోతుందని టాక్.
ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలా ఫిట్ ప్యాకులు బాగానే చూపించినా వాటికి డిఫరెంట్ గా తన లుక్ ఉండాలి అన్న ఆలోచనలతో బన్నీ ఈ 8 ప్యాక్ విషయమై శ్రద్ధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హృతిక్ రోషన్ తో 'మొహంజొదారో' సినిమాలో నటించి నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన పూజా హెగ్డే ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు వస్తున్నాయి. అన్నీ కలిసి వస్తే వచ్చే సమ్మరుకు ఈసినిమాను రిలీజ్ చేసి తిరిగి వచ్చే ఏడాది కూడ సమ్మర్ రేస్ విజేతగా మారాలని ప్రయత్నిస్తున్నాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com