వస్తు, సేవల పన్నుబిల్లును వ్యతిరేకించలేదు: చిదంబరం
- August 03, 2016
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. బుధవారం రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గడచిన 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షం ఆమోదం లేకుండా జీఎస్‌టీ బిల్లు ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. ఈసారి ప్రధాన ప్రతిపక్షం ఆమోదంతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశించామన్నారు. బిల్లులో సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా చర్చల ద్వారా బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును భాజపా వ్యతిరేకించిందని చిదంబరం పేర్కొన్నారు.
18శాతానికి మించకుండా పన్నులు జీఎస్‌టీ బిల్లులో సవరణలకు అంగీకరించినందుకు సంతోషంగా ఉందని చిదంబరం అన్నారు. పన్ను ఎంత ఉంటుందనేదే బిల్లుకు గుండె వంటిదని, 18శాతానికి మించకుండా పన్నులు ఉండాలని అప్పుడే ప్రజామోదం అవుతుందన్నారు. పార్లమెంటు ఆమోదంతోనే పన్నుల రేట్లలో మార్పులు చేయాలని సభకు తెలిపారు. బిల్లులో మరో 3 సవరణలు చేయాల్సి ఉందని చిదంబరం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







