జెట్ ఎయిర్వేస్ వారి వీకెండ్ ఆఫర్
- July 24, 2015
సాధారణంగా శని, ఆదివారాల్లో విమాన టికెట్లు బుక్ చేసుకోవాలంటే మామూలు రోజుల కంటే కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి కదూ. కానీ, జెట్ ఎయిర్ వేస్ మాత్రం ఇప్పుడు మామూలు టికెట్ల ధరల కంటే కూడా వీకెండ్ టికెట్ల ధరను కాస్త తగ్గిస్తూ ప్రత్యేక ఆఫర్ ఒకటి ప్రకటించింది. కేవలం స్వదేశీ ప్రయాణాలకే కాక.. అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా ఈ ఆఫర్ పెట్టింది. జెట్ ఎయిర్ వేస్ వెబ్ సైట్ తో పాటు, మొబైల్ యాప్ లో కూడా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈనెల 25-26తో మొదలుపెట్టి, ప్రతి వారాంతంలోనూ ఈ ఆఫర్ ఉంటుంది. బేస్ ఫేర్ తో పాటు ఫ్యూయల్ సర్ ఛార్జి మీద కూడా 15 శాతం డిస్కౌంటు ఇస్తున్నారు. మొత్తం 51 స్వదేశీ, 22 అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. గత ఆదివారం జెట్ ఎయిర్ వేస్ తన స్వదేశీ విమానాల్లో బిజినెస్ క్లాస్ ధరలను దాదాపు 50 శాతం వరకు తగ్గించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







