ఆమె గెలుపు
- July 30, 2015
సమస్యల ప్రళయం నన్ను చుట్టుముట్టి భాదల
ఊభిలొకి మనసు కూరుకు పోయినాక
నాకు ఆశల రెక్కలు తొడిగి ఒడ్డున కూర్చొన్న
నువ్వు నీ మమతల కొంగు అందించి
ఏదో తెలియని ఊహల లోకం లోకి లాగేస్తావు
నన్ను నేను కోల్పోయి బాధ్యతలు లేని
సోమరితనంలో ముసుగు తన్నినప్పుడు
నీ అరుపుల చరుపులతో నన్ను
కర్యోన్ముకునిగా మలచుతావు
ఆకాశంలో మబ్బుల్లా,నీకు నాకు మధ్య
'మాట పట్టింపు' మొలక మొలిచి,
మనసు ముడుచుకున్నప్పుడు
కుండ పోత వర్షం చివర నీఒక వెచ్చని సూరిడులా
చిరు చిరు చిర్నవ్వులతో,నాలో పేరుకున్న పెంకి తనాన్ని
దులిపి,నా 'అహం' ఉనికిని చెరిపేస్తావు
సుతి మెత్తని నీ భావుకతలో ముంచి
నన్ను నేను కోల్పోయ్యే వెర్రిగా మారుస్తావు
పువ్వులా నువ్వు ఉంటూనే నాలో..లోపలి
అసహనాల ముళ్ళను నీ సున్నితత్వపు రెమ్మలతో
అనిచివేస్తావు
ఒంపు సొంపులతో మెలికలు తిరుగు నదివి, నిన్ను
ఎదురీద లేని అశక్తున్ని నన్ను చేసి,నీ ప్రవాహ వేగంలో
కలుపుకు ప్రయాణం సాగిస్తావు
నీదైన నీ నాగస్వరంతో మైమరపించి
నాగును నన్ను చేసి ఆడిస్తావు
సర్వం నీకన్నా తక్కువను చేసి,జయించి
ఓటమిలో నన్ను బంధించి ఎప్పుడూ ..
నీ గెలుపుతో
హృదయ రాణివై ఏలుతునే ఉంటావు ....
(13-04-2014)
జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







