ఫేస్‌ వాష్‌ జెల్‌తో ముఖం కడుక్కుంటున్నారా?

- July 30, 2015 , by Maagulf
ఫేస్‌ వాష్‌ జెల్‌తో ముఖం కడుక్కుంటున్నారా?

ప్రతీరోజూ ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోవడం అనే అలవాటు చాలా మంచిదే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాల ఫ్రూటీ ఫేస్‌ వాష్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రూటీ ఫ్లేవర్సే కదా ఏమవుతుంది అనుకునేరు. అన్ని రకాల ఫ్రూట్‌ ఫేస్‌ వాష్‌లు అందరి శరీర తత్వానికి పడవు. ముఖ్యంగా ముఖం మీద ఉన్న చర్మం మన శరీరంలోకెల్లా అతి సున్నితమైనది. అందుకే ఈ ఫేస్‌ వాష్‌లతో ముఖం కడుక్కునేవారు కొంత అప్రమత్తంగా ఉండాలి. చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ వీటిని వాడినా ఎక్కువ నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఎక్కువగా రబ్‌ చేయకుండా సున్నితంగ వాష్‌ చేసుకోవాలి. మరీ సున్నిత చర్మం ఉన్న వారు గ్రీన్‌టీ ఎసెన్స్‌ ఉన్న ఫేస్‌వాష్‌లను ఎంచుకోవాలి. మేకప్‌ తొలగించిన వెంటనే మామూలు నీటితోనే ముఖం కడుక్కోవాలి. ఫేస్‌వాష్‌ జెల్‌ని వాడకూడదు. దీనివల్ల చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్లూ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మేకప్‌ తొలగించడానికి చల్లని నీళ్లను ఉపయోగించి తరువాత మాయిశ్చరైజర్‌ రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది, మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాదు చర్మం మీది జిడ్డుని తొలగించుకోవడానికి కొందరు టిష్యూ పేపర్లను కూడా వాడతారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి, బరకగా మారుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com