మిలిటెంట్లు పోలీసుల తుపాకులతో పరారీ
- September 08, 2016
కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఇంటిపై మిలిటెంట్లు దాడి చేశారు. భద్రతా సిబ్బందిని కొట్టి.. వారి తుపాకులతో పరారయ్యారు. కుల్గాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్ బ్లాక్ ప్రెసిడెంట్ అబ్దుల్ రషీద్ ఖాండే ఇంటి ఆవరణలోకి కొందరు మిలిటెంట్లు చొరబడ్డారు. రషీద్ ఇంటి వద్ద కాపలా కాస్తున్న భద్రతాసిబ్బందిపై దాడి చేసి, నాలుగు సర్వీసు తుపాకులను ఎత్తుకెళ్లారు. దీంతో రషీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.కశ్మీర్ వ్యాప్తంగా భద్రతాసిబ్బందిని అప్రమత్తం చేసి, పరారైన మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









