బిగ్‌బి, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్ లో సినిమా...

- September 08, 2016 , by Maagulf
బిగ్‌బి, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్ లో సినిమా...

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. తొలిసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కనున్న 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' చిత్రం కోసం వీరు కలవబోతున్నారు. ఈ చిత్రానికి విజరుకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్‌ నటించిన 'ధూమ్‌ 3' చిత్రానికి కూడా విజరుకృష్ణ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాపై బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ నెలకొంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com