బెంగళూరు సిటి మొత్తం 144 సెక్షన్..

- September 12, 2016 , by Maagulf
బెంగళూరు సిటి మొత్తం 144 సెక్షన్..

కావేరి జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ఉదృతం చేశారు. ఆందోళనలుల ఎక్కువ కావడంతో పరిస్థితి అదుపుతప్పింది. బెంగళూరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు.బెంగళూరు నగరంలో తమిళ ప్రజలు ఎక్కువుగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు వాహనాలు రోడ్ల మీదకు రాకుండ చర్యలు తీసుకున్నారు.

బెంగళూరులో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న హలసూరు, కళ్యాణనగర్, రామమూర్తి నగర్, జయనగర 9వ బ్లాక్, శ్రీరాంపుర, ఓకళీపురం, బనశంకరి, సిటీ మార్కెట్, శివాజీనగర, ప్రకాష్ నగర, విల్సన్ గార్డెన్, బాణసవాడి, మడివాళ, మారతహళ్ళి, విజనాపుర, కమ్మనహళ్ళి, నాగవార, కేజీహళ్ళి, సుల్తాన్ పాళ్య తదితర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారుబెంగళూరు నగరంలో అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. సోమవారం ఉదయం నుంచి ఆందోళనలు చేపట్టారు. మద్యాహ్నం ఆందోళలు అదుపుతప్పి హింసాత్మకంగా మారింది.బెంగళూరు మెట్రో రైలు సర్వీసు రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో బీఎంటీసీ వాహనాల మీద రాళ్లు విసిరారు. పలు ప్రాంతాల్లో దాడులు చెయ్యడంతో మహిళలు, పిల్లలు, వృద్దులు పరుగు తీశారు.పలు కన్నడ సంఘాల కార్యకర్తలను పోలీసులు చితకబాదేశారు. తమిళనాడులో కర్ణాటక జెండాలను తగలబెట్టడం, కన్నడిగుల మీద దాడులు చెయ్యడం, వుడ్ ల్యాండ్స్ హోటల్ మీద పెట్రోల్ బాంబులు విసరడంతో కన్నడిగులు సహనం కోల్పోయారు.

బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తమిళ ప్రజలకు చెందిన షాపులు, హోటల్స్ మీద దాడులు మొదలు పెట్టారు. ఈ గొడవలు ఎక్కువ కావడంతో సామాన్య ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే హడలిపోతున్నారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com