24 నుంచి ప్రారంభం కానున్న'సెలబ్రిటీ బ్యాట్మింటన్‌ లీగ్‌'

- September 12, 2016 , by Maagulf
24 నుంచి ప్రారంభం కానున్న'సెలబ్రిటీ బ్యాట్మింటన్‌ లీగ్‌'

సెలబ్రిటీ బ్యాట్మింటన్‌ లీగ్‌లో తలపడనున్న టాలీవుడ్‌ థండర్స్‌ ప్రాంచైజీని ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రం మాదాపూర్‌లోని ఆవాస హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటులు తరుణ్‌, నిఖిల్‌, సుధీర్‌బాబుతో పాటు, సినీ తారలు మంచులక్ష్మి, ఛార్మి, సంజన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్‌లో సింధు విజయం తర్వాత బ్యాడ్మింటన్‌ క్రీడకు ఆదరణ పెరిగిందని నాగచైతన్య చెప్పారు. ఈ లీగ్‌ విజయవంతం కావాలని ఆకాక్షించారు. టాలీవుడ్‌ థండర్స్‌ జట్టుకు సుధీర్‌బాబు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా తరుణ్‌, నిఖిల్‌, కౌశల్‌, నవీన్‌, సత్య, అనిల్‌, కృష్ణచైతన్య జట్టు సభ్యులుగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com