క్రేన్‌ క్రాష్‌ ఘటన బాధితులకు స్పెషల్‌ 'హజ్‌'

- September 14, 2016 , by Maagulf
క్రేన్‌ క్రాష్‌ ఘటన బాధితులకు స్పెషల్‌ 'హజ్‌'

మక్కా గ్రాండ్‌ మాస్క్‌లో గత ఏడాది జరిగిన క్రేన్‌ క్రాష్‌ ఘటనలో తీవ్ర గాయాల పాలై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి, ఈ ఏడాది హజ్‌ ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వారిలో ట్యునీషియాకి చెందిన యూసుఫ్‌ అనే వ్యక్తి, తనకు కల్పించిన హజ్‌ సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వైద్య ఖర్చులు భరించడంతోపాటుగా, హజ్‌ యాత్ర నిర్వహించేందుకుగాను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ సౌకర్యం ఉన్న అంబులెన్స్‌ని ఏర్పాటు చేశారని తెలిపాడాయన. హజ్‌ యాత్ర సందర్భంగా పూర్తిస్థాయిలో వైద్య సహాయం తనకు అందిందని వివరించారు యూసుఫ్‌. గత ఏడాది గ్రాండ్‌ మాస్క్‌లో జరిగిన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ షాక్‌కి గురిచేసింది. అయితే ఆనాటి ఘటన పట్ల ఆందోళన కొంత ఉన్నా, హజ్‌ యాత్రకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో యాత్రీకులు వచ్చి ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com