యూఏఈలో ఓనమ్‌ షాపింగ్‌

- September 14, 2016 , by Maagulf
యూఏఈలో ఓనమ్‌ షాపింగ్‌

అబుదాబీ: యూఏఈలోని మలయాళీలంతా ఓనమ్‌ ఫెస్టివల్‌ మూడ్‌లో ఉన్నారు. కలర్స్‌ ఫ్యాషన్‌ ట్రేడింగ్‌ షాప్‌లో ఓనమ్‌ సందర్భంగా అవసరమైన దుస్తులను ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే ఓనమ్‌కి సంబంధించిన అన్నీ ఇక్కడ లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేశారు. మూడేళ్ళుగా కాదర్‌ అతని పార్టనర్‌ రాయ్‌ వర్గీస్‌ - అబుదాబీలో ఇండియన్‌ ట్రెడిషనల్‌ దుస్తుల్ని, సంప్రదాయ బద్ధంగా వారికి కావాల్సిన వివిధ వస్తువల్ని విక్రయిస్తున్నారు. ఇండియన్‌ స్కూల్స్‌లో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ జరుగుతుంటాయనీ, వాటి కోసం తమ షాప్‌లో అన్నీ అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. పలు దుకాణాల్లోంచి ఇదివరకు వీటిని సేకరించేవారనీ, తాము అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచామని వారు వివరించారు. ఓనమ్‌ కోసం ప్రత్యేకంగా వినియోగించే పామ్‌ లీవ్స్‌తో తయారు చేసిన అంబ్రెల్లాస్‌, వుడెన్‌ చెప్పల్స్‌, క్రౌన్స్‌ ఫర్‌ మహాబలి, క్రీమ్‌ శారీస్‌ విత్‌ గోల్డెన్‌ బోర్డర్స్‌ మరియు ఇమిటేషన్‌ జ్యుయెలరీని ఓనమ్‌ సందర్భంగా అందుబాటులో ఉంచారు. ఈ సంప్రదాయ దుస్తుల్ని స్టిచ్‌ చేసి ఇవ్వడంతోపాటు, అద్దెకు కూడా ఇస్తామన్నారు. టైగర్‌ డాన్స్‌ (పులికాలి) కోసం ఓనమ్‌ సందర్భంగా డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com