నో స్కూల్‌ బ్యాగ్స్‌ - నో హోమ్‌ వర్క్‌: సిబిఎస్‌ఇ

- September 20, 2016 , by Maagulf
నో స్కూల్‌ బ్యాగ్స్‌ - నో హోమ్‌ వర్క్‌: సిబిఎస్‌ఇ

ఇండియాకి చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌, ఓ సర్కులర్‌లో ఒమన్‌లోని స్కూళ్ళకు స్కూలు విద్యార్థుల పుస్తకాలు, బ్యాగ్‌లు, హోమ్‌ వర్క్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థులు స్కూల్‌ బ్యాగ్‌లను తీసుకువెళ్ళరాదనీ, వారికి ఎలాంటి హోమ్‌ వర్క్‌ ఇవ్వరాదని పేర్కొన్నారు. ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ విల్సన్‌ వి జార్జ్‌, సిబిఎస్‌ఇ ఆదేశాలను ఆచరణలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. సర్క్యులర్‌లో చాలా రికమండేషన్స్‌ ఉన్నాయని ఆయన వివరించారు. ఒమన్‌లో మొత్తం 19 ఇండియన్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిల్లో 1 నుంచి 2వ తరగతి చుదువున్న విద్యార్థుల సంఖ్య 9,000 వరకూ ఉంటుంది. అలాగే, స్కూళ్ళు విద్యార్థులపై భారం మోపకుండా ఉండాలనీ, 1 నుంచి 8 తరగతుల వరకు తక్కువ బరువుతో కూడిన బ్యాగేజ్‌ మాత్రమే ఉండేలా పుస్తకాల సంఖ్యను తగ్గించాలని సర్కులర్‌ చెబుతోంది. ఎదిగే వయసులో పిల్లల వెన్ను భాగంపై పుస్తకాల బ్యాగ్‌ల కారణంగా ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. భవిష్యత్తులో వారు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ కారణంగా బ్యాగ్‌ల బరువు తగ్గింపుపై సిబిఎస్‌ఇ ఈ నిర్ణయం తీసుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com