దుబాయ్ ఆన్ లైన్ బ్లడ్ డోనర్స్ వెబ్సైటుకి అనూహ్య స్పందన
- August 09, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత దౌత్యవేత్త రక్తదాన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నడుం బిగించారు. ఆయన పేరు.. తిజు థామస్. అత్యవసర సందర్భాల్లో రక్తం అందుబాటులో లేక.. భారత్ తరహాలో రక్తదాతల సమాచారమూ లేక దుబాయ్‌లో, ఇతర ఎమిరేట్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆయన తొలిసారిగా రక్తదానం కోసం ఒక వెబ్‌సైట్‌ను నెలకొల్పారు. యూఏఈలో తెలుగువారు, తోటి భారతీయులు.. రక్తదానం ఆవశ్యకతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ‘ఆంధ్ర జ్యోతి’ గల్ఫ్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అందుకే www.blooddonors.ae పేరిట పోర్టల్ ఏర్పాటు చేశామన్నారు. దీనికి దుబాయ్‌లో అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. దాదాపు 70వేల మంది సైట్‌ను సందర్శించారని, ఈ నేపథ్యంలో రక్తదానం ఆవ శ్యకత, రక్తదాతల వివరాలతో మొబైల్ యాప్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1250 మంది రక్తదాతలు తమ సైట్లో పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ సైట్‌ను.. యుఏఈ సమాజానికి భారతీయుల బహుమతిగా అభివర్ణించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







