దుబాయ్ ఆన్ లైన్ బ్లడ్ డోనర్స్ వెబ్సైటుకి అనూహ్య స్పందన

- August 09, 2015 , by Maagulf
దుబాయ్ ఆన్ లైన్ బ్లడ్ డోనర్స్ వెబ్సైటుకి అనూహ్య స్పందన

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో భారత దౌత్యవేత్త రక్తదాన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నడుం బిగించారు. ఆయన పేరు.. తిజు థామస్‌. అత్యవసర సందర్భాల్లో రక్తం అందుబాటులో లేక.. భారత్‌ తరహాలో రక్తదాతల సమాచారమూ లేక దుబాయ్‌లో, ఇతర ఎమిరేట్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆయన తొలిసారిగా రక్తదానం కోసం ఒక వెబ్‌సైట్‌ను నెలకొల్పారు. యూఏఈలో తెలుగువారు, తోటి భారతీయులు.. రక్తదానం ఆవశ్యకతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ‘ఆంధ్ర జ్యోతి’ గల్ఫ్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అందుకే www.blooddonors.ae పేరిట పోర్టల్‌ ఏర్పాటు చేశామన్నారు. దీనికి దుబాయ్‌లో అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. దాదాపు 70వేల మంది సైట్‌ను సందర్శించారని, ఈ నేపథ్యంలో రక్తదానం ఆవ శ్యకత, రక్తదాతల వివరాలతో మొబైల్‌ యాప్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1250 మంది రక్తదాతలు తమ సైట్‌లో పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ సైట్‌ను.. యుఏఈ సమాజానికి భారతీయుల బహుమతిగా అభివర్ణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com