ఇరాక్ లో 300 మంది ఉద్యోగులను చంపిన ఐసిస్
- August 09, 2015
ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగపడ్డారు. ఏకంగా 300 మంది ఆ దేశ పౌరుల్ని దారుణంగా హత్యచేశారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఇరాక్ సుప్రీం ఎలక్టోరల్ కమిషన్‌లో పని చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఐసిస్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. నినెవెహ్ ప్రావిన్స్‌లోగల మోసూల్‌లో 50 మంది మహిళలను చంపారు. కమిషన్‌లో పని చేస్తున్న మొత్తం 300 మందిని చంపారని అధికారులు తెలిపారు. మరికొన్న చోట్ల కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కమిషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వెంటనే అంతర్జాతీయ, మానవహక్కుల సంఘాలు కల్పించుకొని ఈ దాడుల నుంచి ఇరాక్ పౌరుల్ని కాపాడాలని కోరారు. తమ కుటుంబసభ్యులను హతమార్చినట్లు ఉగ్రవాదులు ప్రకటించారని, అయితే వారి మృతదేహాలను మాత్రం అప్పగించలేదని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. మోసూల్‌పై పట్టుసాధించిన ఐఎస్ ఉగ్రవాదులు.. ఉత్తర ఇరాక్‌లోని ఇతర నగరాలను అక్రమించుకునేందుకు ఈ రకమైన దాడులకు దిగుతున్నారు. అఫ్ఘాన్‌లో పేలుడు: 22మంది మృతి ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో శనివారం అర్ధరాత్రి కారు బాంబు పేలుడు సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందారు. ఖాన్ అబాద్ జిల్లాలో ఓ మిలిటెంట్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







