రామోజీ ఫిలింసిటీలో ఇండీవుడ్‌ ఫిలిమ్‌ కార్నివాల్‌-2016 సందడి..

- September 26, 2016 , by Maagulf
రామోజీ ఫిలింసిటీలో ఇండీవుడ్‌ ఫిలిమ్‌ కార్నివాల్‌-2016 సందడి..

ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలో ఇండీవుడ్‌ ఫిలిమ్‌ కార్నివాల్‌-2016 సందడిగా జరుగుతోంది. కార్నివాల్‌లో భాగంగా మూడోరోజు కార్యక్రమాలు వీక్షకులను అలరిస్తున్నాయి. యువతలో దాగివున్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఉద్దేశించిన టాలెంట్‌ హంట్‌ కార్యక్రమానికి విశేష స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న యువత తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అమెరికా, జపాన్‌, కాంబోడియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన చిత్రాలు ఫిలిం స్క్రీనింగ్‌లో భాగంగా ప్రదర్శితమవుతున్నాయి. బీఎస్‌ఎఫ్‌ ప్లోర్‌లో జరుగుతున్న స్టాళ్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. సౌండ్‌, లైటింగ్‌, కెమెరాలకు చెందిన అధునాతన పరికరాలు అబ్బురపరుస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com