ఇండోనేసియా అంతర్జాతీయ వలస కార్మికుల సదస్సులో పాల్గొన్న ప్రవాసి కార్మిక నాయకుడు యం.భీంరెడ్డి
- August 11, 2015
కార్మికుల వలసలతో ఎవరు లబ్ది పొందుతున్నారు ? కార్మికుల హక్కులు, సంపద పంపిణీ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ఇండోనేసియాలోని బోగోర్ పట్టణంలో సోమవారం (09.08.2015) న హోటల్ నోవాటెల్ లో ప్రారంభమయ్యింది. అమెరికన్ సాలిడారిటీ సెంటర్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 250 మంది కార్మిక నాయకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
రక్షిత వలసలు, మానవ అక్రమ రవాణా, భద్రతలేని ఉద్యోగాలు, సాంఘిక భద్రత అనే అంశాలపై చర్చ జరిగింది. ఇందులో ఇండోనేసియా మానవ వనరులు, వలసల మంత్రి మహ్మద్ హనీఫ్ దక్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సదస్సులో అమెరికాకు చెందిన నేహా మిశ్రా, బాదర్ బ్లావు, జేమ్స్ బొలాండ్, జాన్ హోసినస్కీ, లీసా మైకగోవన్, సౌత్ ఆఫ్రికాకు చెందిన జానే బారెట్, హాంగ్ కాంగ్ కు చెందిన సంజీవ్ పండిత, బెల్జియం కు చెందిన చిది కింగ్, స్విట్జార్లాండ్ కు చెందిన మిశేల్లి లైటాన్, , ఇండోనేసియాకు చెందిన అనీస్ హిదాయా, ఆస్ట్రేలియాకు చెందిన నికోలా పైపెర్, భారత్ కు చెందిన జస్ట్ జాబ్స్ నెట్ వర్క్ కు చెందిన సబీనా దివాన్ లు ప్రసంగించారు.
ముగింపు సమావేశానికి విచ్చేసిన ఇండోనేసియా విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీమతి రెట్నో మర్సుది తో భారత్ కు చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రముఖ కార్మిక నాయకులు రామచంద్ర కుంతియా, ప్రవాసి కార్మిక నాయకులు మంద భీంరెడ్డి లు కలిసి అంతర్జాతీయ వలస కార్మికుల సమస్యల గురించి వివరించారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









