రిషిత మరియు స్వర్ణ లను వరించిన ' ప్రవాసి స్త్రీ శక్తి' అవార్డు
- September 29, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ప్రవాసి మిత్ర సంయుక్తంగా ప్రకటించిన "ప్రవాసి స్ర్తీశక్తి" అవార్డుకు శ్రీమతి రిషిత మరియు స్వర్ణ ఎంపికైనారు.
యూ.ఏ.ఈ.లోని తెలంగాణ సంక్షేమ సంఘం అయున ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్లో(ETCA) మహిళా సభ్యులుగా ఉంటూ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, సామాజిక సేవలో చేస్తున్న కృషిని గుర్తించి వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
‘ప్రవాసీ బతుకమ్మ’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో,విదేశాల్లో ఉంటూ పలు రంగాల్లో సామాజిక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించే మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న జీవనజ్యోతి క్యాంపస్లో ఈ అవార్డులను నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయిన శ్రీ కిరణ్ కుమార్ పీచర గారు మరియు సంఘం సభ్యులు తమ అభినందనలు తెలియజేసారు.
ప్రవాసీ స్ర్తీశక్తి అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శ్రీమతి రిషిత గుప్తా అన్నారు. కాగా హైదరాబాద్ కు చెందిన శ్రీమతి స్వర్ణ ముమ్మాడి గారు విదేశాల్లో ఉంటున్న భారతీయ మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







