హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి "జోడు గుర్రాల స్వారిలో..."

- October 13, 2016 , by Maagulf
హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి

జయాపజయాల సంగతె లావున్నా హాస్యనటు లెందరో హీరోలుగా అవతారం ఎత్తిన సంగతి తెలియంది కాదు. ఆ కోవలో ఓ పక్క హాస్యనటుడిగా కొనసాగుతూనే మరోపక్క హీరోగా సినిమాలను చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి. లోగడ "గీతాంజలి'లో హీరోగా నటించడం ద్వారా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఆయన ఆ స్ఫూర్తితో మంచిస్క్రిప్ట్‌లు లభిస్తే హీరోగా నటించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెరకెక్కుతున్న "జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం ద్వారా మరోసారి కథానాయకుడిగా ఆకట్టుకోవాలని ఆశిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నటుడిలో ఒక్కో అంశాన్ని పండించగల ప్రత్యేక నేర్పు ఉంటుందని, అలాగే వెటకారాన్ని ఎంతోబాగా పండించగలరన్న పేరు శ్రీనివాసరెడ్డికి ఉంది.అయితే త్వరలో రానున్న "జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రంలో సెంటిమెంట్‌, భావోద్వేగాలను కూడా ఆయనెంతో బాగా పండించారట. ఇదే విషయాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ప్రస్తావిస్తూ శ్రీనివాసరెడ్డికి కితాబునివ్వడం విశేషం. ఓ పక్క హీరోగా అవకాశాలొస్తున్నప్పటికీ హాస్య పాత్రలను వదిలిపెట్టే ప్రసక్తేలేదని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. అయితే జోడుగుర్రాల స్వారీలో ఎంతవరకు ఆయన కృతకృత్యులౌతారో వేచిచూడాల్సిందే.ఇదిలావుండగా ఎప్పుడైతే శ్రీనివాసరెడ్డి హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టారో అప్పుడే ఆయనకు హాస్య పాత్రలు తగ్గుముఖం పట్టాయి. ఇదే విషయాన్ని శ్రీనివాసరెడ్డి దగ్గర ప్రస్తావిస్తే..తాను హాస్య పాత్రలు చేయనని కొందరు అపోహ చెందడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తనచేతిలో హాస్యపాత్రలకు సంబంధించిన చిత్రాలు కొన్ని ఉన్నాయని అన్నారు. అలాగే స్క్రిప్ట్‌ నచ్చితే హీరోగా చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టంచేశారు  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com