లక్ష్మీరాయ్ లక్కీ చాన్స్ కొట్టేసింది..

- October 13, 2016 , by Maagulf
లక్ష్మీరాయ్ లక్కీ చాన్స్ కొట్టేసింది..

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ల్ లక్ష్మీరాయ్ లక్కీ చాన్స్ కొట్టేసింది.. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నెం. 150' లో ప్రత్యేక గీతంలో నర్తించనుంది. వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో, అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ప్రస్తుతానికి ఈవారంలో ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించేందుకు 'ఖైదీ నెం 150' టీమ్ రెడీ అయిపోయింది. మొదట ఈ స్పెషల్ సాంగ్‌కు క్యాథరిన్ థ్రెసాను ఎంపిక చేసినా, తాజాగా లక్ష్మి రాయ్‌ను ఈ స్పెషల్ సాంగ్‌కు కన్‌ఫర్మ్ చేశారు.చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. లక్ష్మీ రాయ్ సాంగ్ మూవీకి హైలెట్ గా ఉంటుందని అంటున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com