ఇండిగో ప్రమోషనల్ ఆఫర్...
- October 13, 2016
విమాన యాన సంస్థ ఇండిగో ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా దేశీయ విమాన ఛార్జీలను భారీగా తగ్గించింది. అన్ని కలుపుకొని రూ.834 నుంచి ప్రారంభమయ్యే ధరలను అందిస్తోంది. ఎంపిక చేసిన డొమెస్టిక్ రూట్లలో ఈ తగ్గింపు ధరలను వర్తింప చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 17వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా అక్టోబర్ 30, 2016 నుంచి ఏప్రిల్ 13, 2017 ప్రయాణించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రమోషనల్ ఆఫర్ లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను మాత్రం ఇండిగో వెల్లడి చేయలేదు. అలాగే ఈ చార్జీలు నాన్ రిఫండబుల్ అని ఒక వేళ టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే చెల్లించబడతాయని స్పష్టం చేసింది.
దీంతోపాటుగా ఈ పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ నెలలో ప్రస్తుత నెట్ వర్క్ లో 47 కొత్త విమానాలను ప్రవేశపెడుతున్నట్టు ఇండిగో ప్రకటించింది.
కాగా ఇండిగో వెబ్ సైట్ లో చెక్ చేసినపుడు ఢిల్లీ-జైపూర్ టిక్కెట్ ఈ ప్రచార ఆఫర్ కింద రూ.867 ప్రారంభ ధరగా చూపిస్తోంది. ఢిల్లీ ముంబై టిక్కెట్ ధర నవంబర్ మధ్యలో ప్రయాణానికి రూ.2,030గా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









