వినూత్న ప్రేమకథాచిత్రం ఎల్‌ 7

- October 20, 2016 , by Maagulf
వినూత్న ప్రేమకథాచిత్రం ఎల్‌ 7

అదిత్‌, పూజా జవేరి జంటగా ముకుంద్‌ పాండేను దర్శకుడిగా పరిచయం చేస్తూ రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై యువ నిర్మాత బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథాచిత్రం ఎల్‌ 7. ముకుండ్‌ పాండే చెప్పిన స్టోరి విన్న వెంటనే సెకండ్‌ ధాట్‌ లేకుండా ఈ సినిమా తీయాలని ఫిక్సయిపోయామని నిర్మాత సుబ్బారెడ్డి తెలిపారు. ప్రేమలోని పలు దశలను ఆవిష్కరిస్తూ సాగే అందమైన ప్రేమకథగా ఎల్‌ 7 ను రూపొందించనున్నామని, ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్న నిర్మాత ఓబుల్‌ సుబ్బారెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఇటీవల విడుదలయిన పాటలను మంచి స్పందన లభిస్తోందని చిత్ర దర్శకుడు ముకుంద్‌ పాండే అన్నారు. కథ, వీకెండ్‌ లవ్‌, తుంగభద్ర చిత్రాల తర్వాత తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తనను ఎల్‌ 7 హీరోగా ఎంపిక చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని హీరో అదిత్‌ అన్నారు.అనంతరం దర్శక నిర్మాతలు ప్లాటినం డిస్క్‌ లను చిత్రబృందానికి అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com