పబ్లిక్ లో మద్యం సేవించే వారికి జరిమానాలతో కూడిన జైలు శిక్ష
- October 26, 2016
మందు బాబులకు ఢిల్లీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కార్లలో పార్టీలు చేసుకుంటూ మద్యం సేవించే యువత ఇకపై బాటిళ్లకు మూత పెట్టక తప్పదు. లేకపోతే డైరెక్ట్ గా జైలుకు వెళ్లాల్సిందే. వచ్చే నెల 7వ తేదీ నుంచి పబ్లిక్ లో మద్యం సేవించే వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జరిమానా లేదా జరిమానాలతో కూడిన జైలు శిక్షను విధించనుంది.ఇందుకోసం ఎక్సైజ్ శాఖ చట్టాలను కూడా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించేవారికి రూ. 5వేల జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి గొడవ చేస్తే జరిమానాను డబుల్ చేయడంతో పాటు సదరు వ్యక్తికి అబ్కారీ శాఖ చట్టం కింద మూడు నెలల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు చెప్పారు.కార్లలో స్నేహితులతో కలిసి మద్యం సేవించడం(కార్-ఓ-బార్) ఢిల్లీలో మామూలే. ఎక్కువ మంది మందు బాబులు లిక్కర్ షాపుల వద్ద లేదా ఫుడ్ కోర్టుల వద్ద నిలిపివున్న కార్లలో మద్యం సేవిస్తూ ఉంటారు. బార్లలో అధిక రేట్లు తట్టుకోలేని యువత ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









