నమ్మక ద్రోహం
- August 24, 2015
ఒక అడవిలో ఒక నక్క ఆకలికి తిరుగుతూ ఉంది. ఎక్కడా ఏది దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా దూరంగా పొదల్లో ఒక చచ్చిన పాము కనిపించింది. ఆకల్తో ఉండడం వల్ల గబగబా దాన్ని తినేసింది. కానీ దానికి ఆకలి తీరలేదు. ఇంకా వెతుకుతూ ఉంది. దారిలో ఒక జింక బాగా కొవ్వు పట్టి కనిపించింది. దాన్ని చూస్తే నక్కకి బాగా నోరూరింది. , దాన్ని ఎలాగయినా మాయచేసి దాని మాంసం తినాలని అనుకుంది. అందుకు దాని దగ్గరకు వెళ్లి జింకమ్మా నువ్వు ఎంతందంగా ఉన్నావో తెలుసా! నీ కళ్లు, శరీరం.. నీకు నువ్వే సాటి. అందంలో నిన్ను మించింది లేదు అని పొగడ్తలతో ముంచెత్తేసింది. దాని పొగడ్తలకు జింక పొంగిపోయి దానితో స్నేహం చేయసాగింది. అలా రెండో రోజు వాళ్లిద్దరూ కలిసి అడవిలో తిరుగుతుండగా ఆకాశం అంతా మబ్బులు కమ్మి వర్షం వచ్చేలా ఉంది. ఇంతలో జింక దృష్టి దూరంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమలి మీద పడింది. అప్పుడు నక్క జింకతో జింకకమ్మా నీకు కూడా అలా డాన్స్ చెయ్యాలనిపిస్తుందా? అయితే నాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు. ఆయన్ని చూస్తేనే నీకు డాన్స్ వచ్చేస్తుంది. నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను పద అంటూ ఒక గుహదగ్గరికి తీసుకువెళ్లి నువ్వు లోపలికి వెళ్లు నేనిక్కడ ఉంటాను అని జింకను లోపలికి పంపించింది. కొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ సింహం కాలిగుర్తులు గమనించింది జిక్క. దాంతో దానికి నక్క ద్రోహం అర్ధమయ్యి ఒక్కసారి లోపలికి తొంగిచూడగా దాని అదృష్టం బాగుండి సింహం మంచి నిద్రలో ఉంది. జింక కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి కాసేపు కాలక్షేపం చేసి సింహం లేచేసరికి బయటికి వచ్చేసి, నక్కతో మీ గురువు గారు చాలా మంచివారు. నాకు బాగా నాట్యం నేర్పించారు. మంచి విందు కూడా పెట్టారు అని చెప్పింది. అది విని నక్క గతుక్కుమని విందు ఏమిటి ఆ సింహానికి వేరే ఆహారం ఏదైనా దొరికి దీన్ని వదిలిపెట్టి ఉంటుంది అనుకుని లోపలికి వెళ్లింది. నిద్రలేచి, ఆకలితో ఉన్న సింహం ఒక్క వేటుతో నక్కని చంపి ఆకలి తీర్చేసుకుంది. నక్క తను తీసుకున్న గోతిలో తనే పడింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







