శ్రీ హరికోట లో 'జీఎస్ఎల్వీ డీ6' రాకెట్ ప్రయోగం విజయవంతం

- August 27, 2015 , by Maagulf
శ్రీ హరికోట లో 'జీఎస్ఎల్వీ డీ6' రాకెట్ ప్రయోగం విజయవంతం

జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్త్రో శాస్త్రవేత్తలు మరోసారి సత్తా చాటారు. జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి దూసుకెళ్లింది. అంతక ముందు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. 2వేల 117 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లింది. ఈ జీశాట్-6 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ కక్ష్యలోకి తీసుకెళ్తుంది. ఈ ఉపగ్రహంం తొమ్మిదేళ్ల పాటు సేవలందించనుంది. ఎస్ బ్యాండ్ ద్వారా మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో కొత్త పరిజ్ఞానం అందించే లక్ష్యంతో జీశాట్-6 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ రెండో వాహననౌక ద్వారా గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగించింది. భారత్ ఇప్పటి వరకు 24 సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. 2001, 2003, 2004, 2007, 2014లో జీఎస్ఎల్‌వీ రాకెట్ల ప్రయోగాలు జరిగాయి. జీఎస్ఎల్‌వీ ద్వారా జీశాట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. గురువారం పంపిన ఉపగ్రహాం జీశాట్-6. జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు ఉత్సాహాంతో ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. జీఎస్‌ఎల్‌వీ డీ6 ప్రయోగం విజయవంతమైంది: ఇస్రో ఛైర్మన్‌ జీఎస్‌ఎల్‌వీ డీ6 ప్రయోగం విజయవంతం అయ్యిందని ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. జీశాట్‌-6 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ డీ6 రాకెట్‌ దానిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. జీఎస్‌ఎల్‌వీ డీ6లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయన్నారు. స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ పనితీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు. జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ ప్రయోజనాలు: * దేశ సమాచార వ్యవస్ధలో తీరనున్న ట్రాన్స్ పాండర్ల కొరత * అందుబాటులోకి రానున్న 10 ఎస్ బ్యాండ్, సీ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు * జీశాట్ -6 ద్వారా ఎక్కువ సమాచారం తెలుసుకునే అవకాశం * స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో నింగిలోకి జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com