బహ్రెయిన్ లో క్షమాభిక్ష అవధిని వినియోగించుకున్న 10,000 మంది ప్రవాసులు

- August 27, 2015 , by Maagulf
బహ్రెయిన్  లో క్షమాభిక్ష అవధిని వినియోగించుకున్న 10,000 మంది ప్రవాసులు

జులై నెల నుండి ఈ సంవత్సరాంతం వరకు కొనసాగే క్షమాభిక్ష కాల వ్యవధిని ఇప్పటివరకు సరైన పత్రాలు, అనుమతులు లేకుండా నివసిస్తున్న 10 వేలకుపైగా ప్రవాస కార్మికులు వినియోగించుకున్నారని, ఇది ఒక గొప్ప విజయమని, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ ఆధారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అల్-అబ్సి అభివర్ణించారు. ఈ సంఖ్య గత 2007 మరియు 2009 సంవత్సరాలను కలిపిన సంఖ్య కంటే ఎక్కువని ఆయన తేల్చారు. ఈ 10వేల మందిలో 80 శాతం పైగా శ్రామికులు కొత్త యజమానుల వద్ద చేరగా, మిగిలినవారు తమ దేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈవిధంగా వెళ్ళేవారిని బ్లాక్ లిస్టులో పెట్టబోమన్నారు. ఇంకా, పాస్పోర్టులు యజమానుల వద్ద ఉండిపోయిన అక్రమ కార్మికులు, వెంటనే తమ ఎంబసీల వద్ద సంప్రదిస్తే, వారు జారీచేసే ఎమర్జన్సీ సర్టిఫికెట్ల ద్వారా , ఏ విధమయిన జరిమానా లేకుండానే తమ దేశానికి వెళ్ళవచ్చని తెలిపారు. శ్రామికుల నుండి క్రమబద్ధీకరణకు డబ్బు వసూలు చేసే మధ్యవర్తులను ఆయన హెచ్చరించారు; ఆ విధమైన కార్మికులు పోలీసువరికి పట్టుబడితే కనీసం 100 బహ్రెయిన్ దీనర్లు, అటువంటి కంపెనీలకు ఒకొక్క కార్మికునికి 1000 చొప్పున  జరిమాన ఉంటుందని హెచ్చరించారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com