ట్రంప్‌కు యూఎస్‌ఐబీసీ సూచన...
- November 10, 2016
అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి టాప్ బిజినెస్ అడ్వైజరీ గ్రూప్.. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్‌ఐబీసీ) సలహాలు, సూచనలు చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు ఆహ్వానించాలని సూచించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ యూఎస్‌ఐబీసీ ఆయనకు లేఖ రాసింది. ఈ లేఖలో మోదీని అమెరికాకు ఆహ్వానించాలని పేర్కొంది.వైట్‌హౌస్‌లోకి వెళ్లిన ఏడాదిలోపే మోదీని ఆహ్వానిస్తే..ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసినట్లవుతుందని యూఎస్‌ఐబీసీ అధ్యక్షుడు ముకేశ్ తెలిపారు. కొత్త వైట్‌హౌస్ అడ్మినిస్ట్రేషన్ తొలి నెలలో చేయాల్సిన పనులను లేఖలో సూచించారు. వీటి ద్వారా భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలుబలోపేతమవుతాయన్నారు. ట్రంప్ బుధవారం అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









