నోట్లు రద్దుపై సుప్రీంకోర్టులో వచ్చేవారం విచారణ...
- November 10, 2016
దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో వచ్చేవారం విచారణ జరగనుంది. కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ జారీ చేసిన ప్రకటన నిరంకుశంగా ఉందని, ప్రజలకు నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇవ్వలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రకటనను కొట్టివేయడమో, లేక నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించడమో చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.
పెద్దనోట్ల రద్దు విషయంపై కేంద్రం కూడా సుప్రీంకోర్టు లో కేవియట్ దాఖలు చేసింది.
తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని, అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోర్టును కోరింది. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీటిని డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









