త్వరలో ప్రారంభంకానున్న టీహబ్‌ ఫేస్ 2

- November 11, 2016 , by Maagulf
త్వరలో ప్రారంభంకానున్న టీహబ్‌ ఫేస్ 2

భాగ్య నగరంలోని సైబర్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో టీహబ్‌ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జ్యోతి వెలిగించి టీహబ్‌ వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, నాస్కామ్‌ ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. టీహబ్‌ రెండో దశను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అభివృద్ధికి వూతమిచ్చే రంగాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com