జాతీయ స్థాయి సదస్సుకు వేదిక కానున్న హైదరాబాద్

- November 12, 2016 , by Maagulf
జాతీయ స్థాయి సదస్సుకు వేదిక కానున్న హైదరాబాద్

మరో జాతీయ స్థాయి సదస్సుకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. 77వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు డిసెంబర్ 15 నుంచి 18 వరకు.. నాలుగురోజుల పాటు హైదరాబాద్ లో జరగనుంది. ఈ సదస్సును ఘనంగా నిర్వహించి.. తెలంగాణ సత్తాను మరోమారు దేశానికి చాటి చెప్పేందుకు కేసీఆర్ సర్కారు రెడీ అయింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది.

తెలంగాణ రాష్ఠ్రం ఏర్పడ్డాక అనేక అంతర్జాతీయ, జాతీయ స్థాయి సదస్సులకు హైదరాబాద్ వేదిక అయింది. తాజాగా మరో జాతీయ సదస్సుకు వేదిక అవుతోంది. 77 వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వార్షిక సదస్సు డిసెంబర్ 15 నుంచి 18 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగబోతోంది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది నిపుణులు హాజరు కాబోతున్నారు.ఈ ఐ ఆర్ సీ సమావేశాలు సజావుగా జరిగేందుకు పదకొండు మంది ఆర్ అండ్ బీ శాఖ పర్యవేక్షక ఇంజనీర్స్ ని 11 కమిటీలకు అధ్యక్షులుగా ప్రభుత్వం నియమించింది. సమావేశాలకు నెల రోజుల సమయమే ఉండటంతో... న్యాక్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మరోవైపు సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ కూడా సదస్సు ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైన మరుసటి రోజు... అంటే డిసెంబర్ 16న మెగా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. దీన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా గడ్కరీని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ప్రతి ఏటా దేశంలో ఒక్కో ప్రదేశంలో నిర్వహిస్తుంటారు. గతేడాది మధ్యప్రదేశ్ లో నిర్వహించారు. ఇప్పటివరకు రెండుస్లారు హైదరాబాద్ లో ఈఐఆర్ సీ సదస్సులు జరిగాయి. చివరిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998లో పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జాతీయ రహదారుల ఇంజనీర్లు, పరిశోధన శాస్త్ర వేత్తలు, కన్సల్టెంట్లు, ఇతర ప్రొఫెషనల్స్ హాజరై... రోడ్ల సాంకేతిక మరియ ప్రధాన సమస్యల పై చర్చిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com